వృశ్చిక రాశి / లగ్నం – 2024

వృశ్చిక రాశి / లగ్నం – అధిపతి కుజ గ్రహం

  • శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. వృశ్చిక రాశి నుండి కుంభ రాశి 4వ స్థానము అవుతుంది
  • గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. వృశ్చిక రాశి నుండి మేషరాశి 6వ స్థానం అవుతుంది.

ధన సంపాదన :

వృశ్చిక రాశి నుండి 4వ స్థానం కుంభ రాశిలో శని గ్రహ గోచార స్థితి. అలాగే 5వ స్థానం మేష రాశిలో గురు గ్రహ గోచార స్థితి. ఇక్కడ రాహు, కేతు గ్రహాల గోచార ప్రభావం వృశ్చిక రాశి మీద లేదు

కావున వృతి లేదా వ్యాపారం ఏదైనా సరే ధన సంపాదన చాలా బాగుంటుంది. ప్రత్యేకించి ఇంజినీర్ సంబంధిత ఉద్యగస్తులకు మరియు వ్యాపారం చేసేవారికి, అలాగే ఆధ్యాత్మిక సంబంధిత ఉద్యాగాలు మరియు వ్యాపారాలు చేసేవారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. ఈ ఆధ్యాత్మిక విషయంలో ప్రత్యేకించి జ్యోతిష్య వృత్తిలో ఉండేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది, ఫైనాన్సియల్ స్టేటస్ మెరుగవుతుంది. అలాగే  వ్యవసాయం చేసే వారికి 2023 సంవత్సరంలో అదృష్టాలు ఉంటాయి.

  • 9వ వృశ్చిక లగ్నానికి అధిపతి కుజ గ్రహం – కుజ గ్రహం లగ్నంలో లేదా 2వ స్థానం  ధనుస్సు రాశిలో  లేక 5వ స్థానం  మీన రాశిలో లేదా 7వ స్థానం వృషభ రాశిలో ప్రత్యేకించి కుజ నక్షత్రంలో స్థితి లేదా 9వ స్థానం కర్కాటక రాశిలో లేదా 10వ స్థానం సింహ రాశిలో స్థితి అయి  3వ స్థానం మకరరాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె ఫలితాలు చాలా బాగుంటాయి
  • అలాగే కుజ గ్రహానికి చెందిన నక్షత్రాలలో లేదా గురు గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయి 3వ స్థానం మకరరాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
  • అలాగే ప్రస్తుతము వీరికి కుజ భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
  • వ్యక్తిగ్రత రాశి చక్రంలో గురు, శని గ్రహాల గోచార దృష్టి కుజ గ్రహం మీద ఫలితాలు చాలా బాగుంటాయి. అలాగే రాహు, కేతు గ్రహాల దృష్టి కుజ గ్రాహం మీద ఉంటె ఫలితాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి.
  • అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం అక్టోబర్ 20 నుండి నవంబర్ మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.

సంఖ్యా శాస్త్ర ప్రకారం

  • సంఖ్యా శాస్త్ర ప్రకారం అక్టోబర్ 24 నుండి నవంబర్ 22 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.

కుటుంబం :

  • కుటుంబ విషయానికి వస్తే, కుటుంబ సమస్యలు మరియు కొర్టు కేసులు ఉన్నప్పటికీ బంధువుల నుండి సహాయం ఉంటుంది.
  • విదేశాల నుండి వచ్చిన బంధువుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.
  • అలాగే వివాహం కానివారికి వివాహం జరుగుతుంది. అలాగే సంతానం లేనివారికి శుభ వార్తలు వింటారు.
  • ఈ రాశి వారు ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటే సహజంగా ఉండే కుటుంబ సమస్యల నుండి విముక్తి ఉంటుంది.

ఆరోగ్యం :

  • వృశ్చిక రాశి జననేంద్రియాలు, లైంగిక వ్యాధులు, గర్భాశయం, మలద్వారం విషయాలకు కారకత్వం వహిస్తుంది.
  • అలాగే కుజ గ్రహం రక్తం, మూత్రాశయ వ్యాధులు, నరాల బలహీనత, బీపీ, గుండెపోటు విషయాలకు కారకత్వం వహిస్తాడు.
  • 2023 సంవత్సరంలో సహజంగా వచ్చే జలుబు, జ్వరాలు తప్ప ఇతర ప్రమాదకరమైన వ్యాధులు రావు. రక్తహీనత సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ వ్యక్తిగత రాశి చక్రంలో ర్హము, కేతు గ్రహాల గోచార స్థితి ప్రభావంలో కుజ గ్రహం ఉంటె  ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయి.
  • అలాగే సూర్య, కుజ గ్రహాలు కూడా రాహు, కేతు గ్రహాల ప్రభావములో ఉంటె ఫైల్స్, బీపీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.  
  • అలాగే కుజ, బుధ గ్రహాలు కూడా రాహు, కేతు గ్రహాల ప్రభావములో ఉంటె నరాల బలహీనత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

 

పరిహారాలు :

  • ప్రతి మంగళవారం వినాయకుడి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు శ్రీ గణేశ గాయత్రి మంత్రం జపించాలి.
  • వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జేష్ట నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి

శ్రీ గణేశ గాయత్రి –

  • ఓం ఏకదంష్ట్రాయ విద్మహే
    వక్రతుండాయ ధీమహి,
    తన్నోదంతిః ప్రచోదయాత్

విశాఖ గాయత్రి మంత్రం –

  • ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
    మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
    తన్నో విశాఖ: ప్రచోదయాత్

అనురాధ గాయత్రి మంత్రం –

  • ఓం మిత్రదేయాయై విద్మహే
    మహామిత్రాయ ధీమహి
    తన్నో అనూరాధా ప్రచోదయాత్

జేష్ట గాయత్రి మంత్రం –

  • ఓం జ్యేష్ఠాయై విద్మహే
    మహా జ్యేష్ఠాయై ధీమహి
    తన్నో జ్యేష్ఠా: ప్రచోదయాత్