వృషభ రాశి / లగ్నం – అధిపతి శుక్ర గ్రహం
- శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. వృషభ రాశి నుండి కుంభ రాశి 10వ స్థానము అవుతుంది
- గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. వృషభ రాశి నుండి మేషరాశి 12వ స్థానం అవుతుంది.
ధన సంపాదన :
వృషభ రాశి ఒక గురుగ్రహ గోచార ప్రభావంలో ఉంది. కావున దేవాదాయ శాఖ మరియు ఆధ్యాత్మిక సంస్థలలో పని చేసేవారికి ధన సంపాదన బాగుంటుంది. అలాగే చిట్ ఫండ్ వ్యాపారాలు మరియు ఫైనాన్స్ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే గ్రూప్ 1 కేటగిరీ ఉద్యోగాలు చేసేవారికి కూడా 2023 సంవత్సరంలో చాలా బాగుంటుంది. ఇక మిగత వారికి మాములుగా ఉంటుంది.
- వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం – 2వ స్థానం మిథున రాశిలో లేదా 6వ స్థానం తులా రాశిలో లేదా 9వ స్థానం మకర రాశిలో లేదా 10వ స్థానము కుంభ రాశిలో లేదా 11వ స్థానం మీనరాశిలో స్థితి అయితే పలితాలు బాగుంటాయి.
- ఈ విదంగా కాకుండా మేష, సింహ మరియు ధనుస్సు రాశిలో శుక్ర గ్రహానికి చెందిన నక్షత్రాలలో అంటే 20 డీగ్రీల నుండి 26.40 డీగ్రీల మద్యలో శుక్ర గ్రహం స్థితి అయిన ఈ పలితాలు ఇంకా బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి శుక్ర భుక్తి నడిస్తే ఈ పలితాలు ఇంకా అద్బుతంగా ఉంటాయి.
- మీ వ్యక్తిగత రాశి చక్రంలో గురు, శని గ్రహాల గోచార దృష్టి శుక్ర గ్రహం మీద లేకుంటే ఈ ఫలితాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. ఒకవేళ దృష్టి ఉంటే ఈ ఫలితాలు ఇంకా చాలా బాగుంటాయి, అలాగే అదృష్టాలు కూడా వరిస్తాయి.
సంఖ్యా శాస్త్ర ప్రకారం
- సంఖ్యా శాస్త్ర ప్రకారం ఏప్రిల్ 21 నుండి మే 21 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.
కుటుంబం :
- గురు గ్రహ గోచార స్థితిని పరిగణనలోకి తీసుకుంటే -.కూతుర్లు / కొడుకులు అభివృద్ధిలోకి వస్తారు. విదేశాలలో ఉన్నా కూతుర్లు / కొడుకులు ఇంటికి వస్తారు.
- కుటుంబమంతా బంధువులతో కళకళలాడుతూ ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారు.
- అలాగే ఏ మాత్రం సమయం దొరికిన కుటుంబమంతా కలిసి తీర్థ యాత్రలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
- ఒకవేళ మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో కేతు గ్రహ గోచరం శుక్ర గ్రహం మీద ఉంటె భార్య, భర్తల మధ్య అన్యోనత ఉండదు. నూతన దంపతులు విడాకుల కోసం కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి
ఆరోగ్యం :
- వృషభ రాశి ముఖం, కండ్లు, చెంపలు, గొంతు విషయాలకు కారకత్వం వహిస్తుంది.
- అలాగే శుక్ర గ్రహం అండాశయ సమస్యలు, అందం మరియు ముఖం మీద మచ్చలు, లైంగిక సమర్థత, నేత్ర సంబంధ సమస్యలు విషయాలకు కారకత్వం వహిస్తుంది.
- శుక్ర, చంద్ర గ్రహాలకు 6, 8, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె అండాశయ సమస్యలు ఉంటాయి.
- అలాగే శుక్ర, కుజ గ్రహాలకు 2, 6 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె సంతాన సమస్యలు ఉంటాయి.
- కేతు గ్రహ గోచార స్థితి వృషభ రాశి ప్రభావంలో ఉంది. కావున గర్భంతో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
- శుక్ర గ్రహానికి 1, 2, 8 స్థానాలతో మరియు కేతు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె నేత్ర సంబంధ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
- అలాగే రక్తహీనత, మూత్రపిండ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పరిహారాలు :
- ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళాలి. ప్రతి రోజు శ్రీ వృషభ గాయత్రి మంత్రం జపించాలి.
- వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి
శ్రీ వృషభ గాయత్రి –
- ఓమ్ ధీక్ష శృంగాయ విద్మహే
వేద హస్తాయ ధీమహి,
తన్నో వృషభ ప్రచోదయాత్
కృత్తిక గాయత్రి మంత్రం –
- ఓం వణ్ణిదేహాయై విద్మహే
మహాతపాయై ధీమహి
తన్నో కృత్తికా ప్రచోదయాత్
రోహిణి గాయత్రి మంత్రం –
- ఓం ప్రజావిరుధ్ధై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్
మృగశిర గాయత్రి మంత్రం –
- ఓం శశిశేఖరాయ విద్మహే
మహారాజాయ ధిమహి
తన్నో మృగశిర: ప్రచోదయాత్