కన్యారాశి / లగ్నం – 2024

 

కన్య రాశి / లగ్నం – అధిపతి బుధ గ్రహం

  • శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. కన్య రాశి నుండి కుంభ రాశి 6వ స్థానము అవుతుంది
  • గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. సింహ రాశి నుండి మేషరాశి 8వ స్థానం అవుతుంది.

ధన సంపాదన :

కన్యా రాశి మీద గురు గ్రహ గోచార ప్రభావం ఉంది. అలాగే కన్యారాశికి 2వ స్థానం కన్య రాశిలో కేతు గ్రహ గోచార స్థితి. కావున ఆధ్యాత్మిక సంబంధిత ఉద్యోగస్తులకు లేదా వ్యాపారం చేస్తున్నవారికి ధన సంపాదన బాగుంటుంది. మిగతావారికి అసలు బాగుండదు. ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి.

అలాగే వైద్య సంబంధిత ఉద్యోగస్తులకు లేదా వ్యాపారం చేస్తున్నవారు జాగ్రతగా ప్రణాళిక చేసుకుంటే నష్టాలను అధిగమించవచ్చు.

  • కన్యా లగ్నానికి అధిపతి బుధ గ్రహం – బుధ గ్రహం లగ్నంలో  లేదా 5వ స్థానం మకర రాశిలో లేదా 9వ స్థానం వృషభ రాశిలో లేదా 10వ  స్థానం మిథున రాశిలో స్థితి అయి 5వ స్థానం మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె ఫలితాలు బాగుంటాయి.
  • అలాగే బుధ గ్రహానికి చెందిన స్వంత నక్షత్రాలలో స్థితి అయి 5వ స్థానము మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు ఇంకా బాగుంటాయి.
  • అలాగే ప్రస్తుతము వీరికి బుధ భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
  • గురు, శని గ్రహాల గోచార దృష్టి బుధ గ్రహం మీద ఉంటె ఫలితాలు చాల బాగుంటాయి.
  • రాహు, కేతు గ్రహాల గోచార దృష్టి బుధ గ్రహం మీద ఫలితాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి.

సంఖ్యా శాస్త్ర ప్రకారం

  • సంఖ్యా శాస్త్ర ప్రకారం ఆగస్ట్ 24 నుండి సెప్టెంబరు 23 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.

కుటుంబం :

  • గురు గ్రహ గోచార స్థితి కారణంగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
  • కుటుంబంలోపండగలాంటి వాతావరణం ఉన్నపటికీ, కన్యా రాశికి 2వ స్థానం తులారాశిలో కేతు గ్రహ గోచార స్థితి కారణంగా ప్రేమ వివాహం చేసుకున్న వారి మధ్య అన్యోనత ఉండదు. ఈ కారణంగావిడాకుల కోసం కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి.
  • అలాగే పుత్రుల వలన నష్టాలు ఉంటాయి.

ఆరోగ్యం :

  • కన్యా రాశి పొట్ట కింది భాగం, నడుం సూచిస్తుంది. అలాగే బుధ గ్రహం ప్రధానంగా నరాల సమస్యలు, చర్మం, మరియు పిచ్చి విషయాలకు కారకత్వం వహిస్తాడు.
  • కేతు గ్రహం పొట్టలోని ప్రేగులు విషయానికి కారకత్వం వహిసాడు.కేతు గ్రహ గోచార ప్రభావంలో కన్యా రాశి ఉంది. కావున జీర్ణ సంబంధ సమస్యలు ఉంటాయి. వీటి కారణంగా పొట్టకు సంబందించిన ఆపరేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. గతంలో ఆపరేషన్స్ జరిగిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి,
  • వ్యక్తిగత రాశి చక్రంలో బుధ గ్రహానికి కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె నడుం నొప్పి సమస్యలు ఉంటాయి. అలాగే అదనంగా 8వ స్థానం / స్థానాధిపతితో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.
  • బుధ గ్రహానికి 2, 8 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె చర్మ సంబంధ వ్యాధులు ఉంటాయి.

పరిహారాలు :

  • ప్రతి బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు శ్రీ వేంకటేశ్వర గాయత్రి మంత్రం జపించాలి.
  • కన్యా రాశిలో ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి

శ్రీ వేంకటేశ్వర గాయత్రి –
ఓం నిరంజనాయ విద్మహే
నిరాధారాయ ధీమహి,
తన్నోవేంకట ప్రచోదయాత్.

ఉత్తర గాయత్రి మంత్రం –
ఓం మహాబకాయై విద్మహే
మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో
ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

హస్త గాయత్రి మంత్రం –
ఓం ప్రయచ్చతాయై విద్మహే
ప్రకృప్రణీతాయై ధీమహి
తన్నో హస్తా: ప్రచోదయాత్

చిత్త గాయత్రి మంత్రం –
ఓం మహాదృష్టాయై విద్మహే
ప్రజారపాయై ధీమహి
తన్నో చిత్త: ప్రచోదయాత్

2023 సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? – http://89g.b09.myftpupload.com/astrology-predictions-2023/