మేష రాశి – జనవరి 2023

ఇక్కడ జనవరి 1, 2023 –

రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.

ధన సంపాదన :

ఇక్కడ ఇవ్వబడిన రాశి చక్రంలో ఉన్న 9 గ్రహాలు మేష రాశి ప్రభావంలో ఉన్నారు. కావున వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యవసాయం, ఇంజనీరింగ్ సంబంధిత వ్యాపారాలు చేసే వారికీ ధన సంపాదన పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ కొత్త సంవత్సరంలో అదృష్టాలు ఉంటాయి. మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో చంద్ర, బుధ, గురు గ్రహాలకు బలంగా సిగ్నిఫికేషన్స్ ఉంటె జ్యోతిష్య వృత్తిలో ఉన్నవారికి మరియు ఆధ్యాత్మిక సంస్థలలో పని చేసేవారికి అభివృద్ధి చాల బాగుంటుంది.

కుటుంబం :

శుక్ర గ్రహ ప్రభావం మేష రాశిలో ఉన్న రాహు గ్రహ ప్రభావంలో ఉంది. కావున కొత్తగా వివాహం జరిగిన దంపతుల మధ్య అన్యోనత ఉండదు. తండ్రి / తల్లి, కూతుళ్ళ మధ్య కూడా చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి

ఆరోగ్యం :

మూత్ర సంబంధిత మరియు మూత్రపిండ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రక్త సంబంధిత మరియు విటమిన్ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం:

ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు గురు గాయత్రి మంత్రం 108 సార్లు జపించాలి.

గురు గాయత్రి –

  • ఓమ్ సురాచార్యాయ విద్మహే
  • వాచస్పత్యాయ ధీమహి,
  • తన్నోగురుః ప్రచోదయాత్

మాస ఫలితాలు – 2023 : https://nsteluguastrology.com/category/monthly-predictions-2023/

మాస ఫలితాలు – జనవరి 2023 : https://nsteluguastrology.com/category/january-month-2023/