మీన రాశి – జనవరి 2023

ఇక్కడ జనవరి 1, 2023 –

రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.

ధన సంపాదన :

ఒక కేతు గ్రహం తప్ప మిగిలిన గ్రహాలన్ని మీన రాశి యొక్క ప్రభావంలో ఉన్నారు. కావున వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ధన సంపాదన బాగుంటుంది. అలాగే చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. పత్రిక రంగం, జర్నలిస్టులకు అలాగే విద్య సంబంధిత వ్యాపారులకు మరియు ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. అలాగే కెమికల్స్, పెట్రోలియం వ్యాపారాలు చేసేవారికి కూడా ధన సంపాదన బాగుంటుంది. వీరికి కొత్తగా వ్యాపారాలు చేసే అవకాశాలు వస్తాయి.

కుటుంబం :

కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధువులతో పండగలాంటి వాతావరణం ఉంటుంది. ఇరుగు, పొరుగు వారితో మంచి సఖ్యత ఉంటుంది.

ఆరోగ్యం :

రక్తహీనత సమస్యలు ఉండి, అలాగే థైరాయిడ్, గొంతు సంబంధిత సమస్యలు ఉన్నవారు, అలాగే బిపి సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి

పరిహారం:

ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాలి. అలాగే గురు గాయత్రి మంత్రం ప్రతిరోజు 108 సార్లు జపించాలి

గురు గాయత్రి –

  • ఓమ్ సురాచార్యాయ విద్మహే
  • వాచస్పత్యాయ ధీమహి,
  • తన్నోగురుః ప్రచోదయాత్

మాస ఫలితాలు – 2023 : https://nsteluguastrology.com/category/monthly-predictions-2023/

మాస ఫలితాలు – జనవరి 2023 : https://nsteluguastrology.com/category/january-month-2023/